Rhino | పార్క్‌లో సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్ట్‌లకు భయంకరమైన అనుభవం ఎదురైంది. టూరిస్ట్ వెహికల్ నుంచి ప్రమాదవశాత్తూ తల్లీ కూతురు కిందపడిపోయారు. ఈ ఘటనలో వారిద్దరూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
అస్సాం (Assam) రాష్ట్రంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్‌లో ఎన్నో అడవి జంతువులుంటాయి. అందులో ముఖ్యంగా ఒక కొమ్ము కలిగిన ఖడ్గమృగాలు (Rhino) చాలా ప్రత్యేకం. దేశంలోకెళ్లా ఈ ఖడ్గమృగాలు కాజీరంగ్ పార్క్ (Kaziranga National Park)లో తప్ప మరెక్కడా లేవు. చాలా అరుదుగా కనిపించే ఈ ఖడ్గమృగాలను చూసేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. అలా సఫారీకి వెళ్లిన తల్లీ కూతురికి ఊహించని అనుభవం ఎదురైంది.
పర్యాటకులతో మూడు జీపులు ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉన్న చోటుకు రైడ్‌కు వెళ్లాయి. ఈ క్రమంలో రెండు వెహికల్స్ రైట్ తీసుకుంటుండగా.. ఓ జీపులోని తల్లీ కూతురు ఒక్కసారిగా రోడ్డుపైకి ఎగిరి పడ్డారు. ఖడ్గమృగం ముందు పడిపోయారు. ఇంతలో వారికి సమీపంలో ఉన్న మరో రినో మూడో జీపువైపుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ తల్లీ కూతురు తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
काझीरंगामध्ये सफारी दरम्यान मोठी दुर्घटना टळली, आई आणि मुलगी गेंड्यांच्या समोर पडल्या, दोघेही सुखरूप बचावले.
.#kaziranga #rhino #accident #forest #assam #jungal #jungalsafari #rhinosafari pic.twitter.com/FWQCXgkbm5— Ritam Marathi (@RitamAppMarathi) January 6, 2025
Also Read..
Buddha Air Flight | ఇంజిన్‌లో మంటలు.. మరో విమానానికి తప్పిన పెను ప్రమాదం
HMPV | భారత్‌లోకి ప్రవేశించిన చైనా వైరస్.. హెచ్‌ఎమ్‌పీవీ లక్షణాలు ఇవే..!
HMPV | బెంగళూరులో రెండు హెచ్‌ఎమ్‌పీవీ కేసులు.. ధృవీకరించిన ICMR