ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 6 : పోరాడి సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆంధ్రులకే ప్రాధాన్యం కల్పిస్తున్నారని విద్యార్థి సంఘాలు(Student unions) భగ్గుమం టున్నాయి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) ఆంధ్ర వ్యక్తులకు పెద్ద పీట వేస్తుండడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవల ఓయూలో జరిగిన పార్ట్‌టైం లెక్చరర్ ఉద్యోగ నియామకానికి నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వహించడమే కాకుండా ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారని విద్యార్థి సంఘాలు ఆరోపింయి.
ఇంటర్వ్యూలో మంచి మార్కులు వచ్చినా, రాతపరీక్షలో మెరిట్ పేరుతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టి తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు జరిగిన తప్పును సరిదిద్ది, తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.