Hyderabad | హైదరాబాద్ : నాచారం పోలీసు స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో జీహెచ్ఎంసీ వాహనం బీభత్సం సృష్టించింది. గోకుల్ నగర్లో జీహెచ్ఎంసీ రోడ్ క్లీనింగ్ వాహనం అదుపుతప్పి.. ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
డ్రైవర్ జీహెచ్ఎంసీ క్లీనింగ్ వాహనాన్ని రోడ్డు పక్కకు నిలిపి ఉంచి కిందకు దిగాడు. అతను దిగిన కాసేపటికే.. వాహనం ఉన్నట్టుండి ముందుకు కదిలింది. రోడ్ క్రాస్ చేసినట్టు.. ఆ వాహనం అవతలి నుంచి ఇవతలి వైపునకు వచ్చింది. అయితే గమనించిన డ్రైవర్ ఆ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో రెండు బైక్లు ధ్వంసమయ్యాయి. ఓ కారు కూడా స్వల్పంగా దెబ్బతిన్నది.
నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్ లో అదుపుతప్పిన జిహెచ్ఎంసి రోడ్ క్లీనింగ్ వాహనం
వాహనాన్ని రోడ్డుపై ఆపి కిందికి దిగిన డ్రైవర్
అదుపుతప్పి వాహనాలపై దూసుకెళ్లిన క్లీనింగ్ వాహనం
వాహనాన్ని ఆపే ప్రయత్నం క్రమంలో జిహెచ్ఎంసి డ్రైవర్ కు తీవ్ర గాయాలు
రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం #ghmc pic.twitter.com/0djV9Fcmod
— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) January 6, 2025
ఇవి కూడా చదవండి..
Osmania University | ఓయూలో ఆంధ్రా వ్యక్తులకు పెద్ద పీట.. భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు
SRDP | ఆరాంఘర్ – జూపార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభం.. ఎస్ఆర్డీపీ ఫలమిదీ..
Liquor bottles | హైదరాబాద్లో భారీగా అక్రమ మద్యం సీజ్..