Traffic Restrictions | హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిమజ్జనం జరిగే సమయంలో తిరిగే సిటీ ఆర్టీసీ బస్సులపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈ నెల 18న ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. సిటీ వ్యాప్తంగా మొత్తం 67 డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రధాన శోభాయాత్ర జరిగే రూట్లో ఇతర వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
మెహిదీపట్నం నుంచి వచ్చే బస్సులను మాసబ్‌ట్యాంక్ వద్ద, కూకట్పల్లి నుంచి వచ్చే బస్సులను ఖైరతాబాద్ వద్ద నిలిపివేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులను చిలకలగూడ క్రాస్ వరకే అనుమతించనున్నారు. గడ్డి అన్నారం, చాదర్‌ఘాట్ వైపు వచ్చే వాహనాలను దిల్సుఖ్నగర్ వద్ద, ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే వాహనాలను ఐఎస్ సదన్ వద్ద నిలిపివేయనున్నారు.
ఇంటర్ సిటీ స్పెషల్ బస్సులను నారాయణగూడ, ఎన్టీఆర్ స్టేడియం వరకే అనుమతించనున్నారు. ఇక మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే బస్సులకు అనుమతి ఇవ్వనున్నారు. అవసరాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామన్నారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జనం పూర్తయిన వాహనాలను ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా మళ్లించనున్నారు. ట్యాంక్ బండ్ మార్గంలో నిమజ్జనం పూర్తయినా వాహనాలను ఆర్టీసీ క్రాస్ రోడ్డువైపు మళ్లించనున్నారు.
ఇవి కూడా చదవండి..
TGSRTC | రేపే గణేశ్ నిమజ్జనం.. 600 ప్రత్యేక బస్సులు నడపనున్న టీజీఎస్ ఆర్టీసీ
Revanth Reddy | కంప్యూటర్ను పుట్టించింది రాజీవ్ గాంధీ అట.. సీఎం రేవంత్ రెడ్డి మాట!!