Revanth Reddy | హైదరాబాద్ : నిత్యం అబద్దాలు మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. కంప్యూటర్ను పుట్టించింది.. ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీనే అని రేవంత్ రెడ్డి గుడ్డిగా, అడ్డగోలుగా, అజ్ఞానంతో మాట్లాడారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సందర్భంగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్‌పై కూడా రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్నారు. రాజీవ్ గాంధీ లేకపోతే ఈ దేశానికి కంప్యూటర్ పరిచయం అయ్యేది కాదని, సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది ఆయనేని రేవంత్ పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ను ఈ దేశానికి పరిచయం చేయకుంటే, ఈ దేశంలో ఐటీ శాఖ ఉండేది కాదు.. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి అయ్యేవాడు కాదు. లేదంటే గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేటోడు.. సిద్దిపేటలో చాయ్, సమోసా అమ్ముకునేటోడు అని నోరు పారేసుకున్నాడు రేవంత్ రెడ్డి.
ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించాలంటే.. కంప్యూటర్ యుగం రావాలని, ఇవాళ మనం వాడుతున్న సెల్ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ కాదా..? అని రేవంత్ రెడ్డి తెలివితక్కువ తనంతో మాట్లాడారు. ప్రపంచంతో పోటీపడే విధంగా సిలికాన్ వ్యాలీని నడిపిస్తున్నామంటే.. అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాం అంటే సాంకేతిక విప్లవం తెచ్చిందే రాజీవ్ గాంధీ.. అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం అని రేవంత్ అజ్ఞానంతో మాట్లాడారు.
కంప్యూటర్ను పుట్టించింది.. ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ.
లేకుంటే కేటీఆర్ ఇక్కడే గుంటూరులో ఇడ్లీ, సమోసాలు అమ్ముకునేవాడు.
రాజీవ్ గాంధీ కంప్యూటర్ను ఈ దేశానికి పరిచయం చేయకుంటే, ఈ దేశంలో ఐటీ శాఖ ఉండేది కాదు.. కేటీఆర్ మంత్రి అయ్యేవాడు కాదు – సీఎం రేవంత్… pic.twitter.com/eH4Q8W0Ahh
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2024
ఇవి కూడా చదవండి..