హైదరాబాద్ : సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో(Old Boinapally) దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. బ్యాంకు ఏటీఎంలు ధ్వంసం చేసి(Broke ATMS) అందినకాడికి నగదు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. ఓల్డ్ బోయిన్పల్లిలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో చోరీ జరిగింది. ఏటీఎంలోకి చొరబడిన దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లారు. అలాగే ఎస్బీఐ ఏటీఎంను సైతం ధ్వంసం చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీని పరిశీలించి విచారణను వేగవంతం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.