ఉషా ముళ్లపూడి అధినేత డాక్టర్ రత్నం కన్నుమూత
ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ మేనేజింగ్ ట్రస్టీ, ప్రముఖ గుండె వ్యాధి నిపుణుడు డాక్టర్ రత్నం వీ ముళ్లపూడి (88) సోమవారం ఉదయం 8.30 గంటలకు కన్నుమూశారు. వయస్సు సంబంధిత రుగ్మతలతో ఆయన మృతి చెందినట్టు ఉషా ముళ్లపూడి దవాఖాన ఒక ప్రకటనలో వెల్లడించింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ మేనేజింగ్ ట్రస్టీ, ప్రముఖ గుండె వ్యాధి నిపుణుడు డాక్టర్ రత్నం వీ ముళ్లపూడి (88) సోమవారం ఉదయం 8.30 గంటలకు కన్నుమూశారు. వయస్సు సంబంధిత రుగ్మతలతో ఆయన మృతి చెందినట్టు ఉషా ముళ్లపూడి దవాఖాన ఒక ప్రకటనలో వెల్లడించింది. డాక్టర్ రత్నంకు భార్య డాక్టర్ నలిని ముళ్లపూడి, కుమార్తె జ్యోతి ముళ్లపూడి ఉన్నారు.
అమెరికాలో ఎంతో విజయవంతమైన గుండె వ్యాధి నిపుణుగా పేరుపొందిన డాక్టర్ రత్నం తన సతీమణితో కలిసి మాతృదేశానికి సేవలందించేందుకు భారత్కు తిరిగి వచ్చారు. ప్రభుత్వ సహకారంతో ఆయన 1998లో లాభాపేక్ష లేని, చారిటబుల్ ట్రస్ట్ దవాఖానగా ‘ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్’ను స్థాపించారు. నామమాత్రపు ఫీజు తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయన ఎంతోమంది పేదలకు వైద్యసేవలందించారు. సుమారు 20వేలకుపైగా గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడి వైద్య నిపుణులకు ఆదర్శంగా నిలిచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్పై రాజ్నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

