హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : భువనగిరి చిట్యాల పీడబ్ల్యూడీ రోడ్డును గోలిగూడెం, సుంకిశాల గ్రామాల మీదుగా కాటేపల్లి వరకు విస్తరించడానికి రూ.49.50 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ జీవో నం 109 సోమవారం విడుదల చేశారు. ఈ రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం మొదట రూ. 36 కోట్లు మంజూరు చేయగా, తాజాగా ఆర్‌అండ్‌బీశాఖ విజ్ఞప్తి మేరకు సవరించిన వ్యయం ప్రకారం నిధులు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోలును ఈనెల 27 వరకు కొనసాగించనున్నట్టు మార్కెటింగ్ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో గడువులోపే రైతులు తమ పత్తిని విక్రయించాలని సూచించింది. వాస్తవానికి సీసీఐ ఈ సీజన్ పత్తి కొనుగోలును ఈనెల 20తో ముగించాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలకు రైతులు పత్తిని తీసుకొస్తున్నారు. దీంతో రైతుల డిమాండ్ మేరకు కొనుగోలును పొడిగించింది.