GHMC Bifurcation | జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా జీహెచ్ఎంసీ విభజనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ విధించినా, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీని విభజించారని గురువారెడ్డి అనే వ్యాపారి పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విభజనపై స్టే విధించాలని పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు కొత్త కమిషనర్లను కూడా నియమించింది.
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ను యథాతథంగా కొనసాగిస్తూ.. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా శ్రీజన, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణా రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Congress | కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో ప్రవర్తిస్తున్నది : గండ్ర వెంకటరమణారెడ్డి
Afghanistan | ఎముకలు విరిగితేనే నేరమట.. గృహ హింసను చట్టబద్ధం చేసిన అఫ్గానిస్థాన్..!
‘మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం’