సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): విద్యా సంస్థల్లో ఆవిష్కరణల ప్రోత్సహించేందుకు తమిళనాడుకు చెందిన పీఎస్ఎన్ఏ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ(Tamil Nadu Engineering College) టీ హబ్తో(T Hub) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టీ హబ్ సీఈఓ ఎం.ఎస్.రావు తోపాటు ప్రతినిధుల బృందం తమిళనాడులోని కళాశాలను అక్కడి మేనేజ్మెంట్తో పాటు విద్యార్థులతో సమావేశమయ్యారు. విద్యార్థుల్లో కళాశాల స్థాయిలోనే అంతప్రెన్యూర్షిప్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు సొంతంగా ఆవిష్కరణలు చేసేలా కళాశాలతో కలిసి పనిచేస్తామని టీ హబ్ సీఈఓ ఎం.ఎస్.రావు తెలిపారు. ఒప్పందం వల్ల వేలాది మంది విద్యార్థులతో టీ హబ్ కలిసి పనిచేసేందుకు అవకాశం ఉందన్నారు.
Also Read..