Kiss for attendance | నీకు హాజరు వేయాలంటే నాకు ముద్దివ్వాల్సిందే.. ఉపాధ్యాయురాలికి లైంగిక వేధింపులు..Video
Kiss for attendance | దేవాలయం లాంటి పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు నీచంగా ప్రవర్తించాడు. ముద్దు కావాలంటూ సాటి ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధించాడు. ఆమె హాజరు విషయాన్ని అడ్డుపెట్టుకుని ముద్దు కోసం డిమాండ్ చేశాడు.
Kiss for attendance : దేవాలయం లాంటి పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు నీచంగా ప్రవర్తించాడు. ముద్దు కావాలంటూ సాటి ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధించాడు. ఆమె హాజరు విషయాన్ని అడ్డుపెట్టుకుని ముద్దు కోసం డిమాండ్ చేశాడు. ముద్దు ఇస్తేనే నీ హాజరు వేస్తానని మెలికపెట్టాడు. అయితే ఆ ఉపాధ్యాయుడి వెకిలి వేషాలను బాధిత ఉపాధ్యాయురాలు వీడియో తీసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాధ్యాయుడి తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళా ఉపాధ్యాయురాలు తన విధులకు సంబంధించిన హాజరు శాతం విషయమై తోటి ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్లింది. తన హాజరుకు ఆమోదం తెలపాలని కోరింది.
దాంతో ‘నీ హాజరు వేయాలంటే నాది ఒక షరతు ఉంది. అది చాలా సరదాగా ఉంటుంది. చాలా సులువుగా పని అవుతుంది’ అని ఉపాధ్యాయుడు వ్యాఖ్యానించాడు. ‘ఏమిటా షరతు..?’ అని ఉపాధ్యాయురాలు అడుగగా ఆ ఉపాధ్యాయుడు సిగ్గు పడుతూ, మురిసిపోతూ తన బుగ్గను చూపిస్తూ ‘ముద్దు కావాలి’ అని చెప్పాడు. అందుకు మహిళా టీచర్ నిరాకరించింది. ‘నీ షరతుకు నేను అంగీకరించను. ఇది చాలా దరిద్రమైన పని’ అని బదులిచ్చింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ ఉపాధ్యాయుడి తీరుపై మండిపడుతున్నారు. రకరకాల కామెంట్లతో దుమ్మెత్తి పోస్తున్నారు. కింది వీడియోలోని ఆ దృశ్యాలను మీరు కూడా చూడండి.
అటెండెన్స్ వేయడానికి ఉపాధ్యాయురాలిని ముద్దు అడిగిన ఉపాధ్యాయుడు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో టీచర్స్ అటెండెన్స్ కోసం తెచ్చిన డిజిటల్ హాజరు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఓ ఉపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయురాలిని ముద్దు పెట్టమని అడిగాడు. pic.twitter.com/KY3uicLldw
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

