Karnataka CM : కాంగ్రెస్ జన్ ఆందోళన యాత్రలో భాగంగా మైసూర్ వేదికగా కర్నాటక సీఎం సిద్ధరామయ్య శుక్రవారం బీజేపీ, జేడీఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. రాజ్‌భవన్ కేంద్రంగా వారు (బీజేపీ-జేడీఎస్) తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆరోపించారు. తనకు భూమి కేటాయించాలని తాను తన పలుకుబడిని ఉపయోగించానని బీజేపీ, జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారని అన్నారు.
మీ హయాంలోనే మీరు నాకు భూమి కేటాయిస్తే అది నా తప్పెలా అవుతుందని సిద్ధరామయ్య కాషాయ నేతలను ప్రశ్నించారు. తన ప్రతిష్టను దెబ్బతీసి ప్రభుత్వాన్ని అస్ధిరపరచాలని అన్ని రకాలుగా బీజేపీ, జేడీఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వాల్మీకి కార్పొరేషన్లో ఎలాంటి అవినీతి లేదని తాను చెప్పడం లేదని స్పష్టం చేశారు. కొందరు అవినీతి అధికారులు, బ్యాంక్ అధికారులను ఈ స్కామ్‌లో ప్రమేయం ఉన్నట్టు గుర్తించి రూ. 87 కోట్లు రికవరీ చేశామని తెలిపారు.
ఈ కేసులో చార్జిషీట్ కూడా దాఖలైందని చెప్పారు. పోక్సో కేసులో మాజీ సీఎం యడియూరప్పపై చార్జిషీట్ నమోదైందని, ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. ఆయన రాజకీయాల్లో కొనసాగేందుకు నైతిక హక్కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. యడియూరప్ప కుమారుడు విజయేంద్ర ఎన్నో స్కామ్‌ల్లో కూరుకుపోయారని సిద్ధరామయ్య ఆరోపించారు.
Read More :
Raghav Chadha | పిల్లలూ మీ మనీశ్ అంకుల్ వచ్చేస్తున్నారు.. సిసోడియాకు బెయిల్ రావడంపై రాఘవ్ చద్దా