హైదరాబాద్ : నిజామాబాద్(Nizamabad)మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ నివాసంపై ఏసీబీ దాడులు(ACB raids) నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయట పడ్డాయి. అతడి ఇంట్లో రూ.2.93 కోట్ల నగదు పట్టుబడింది. అలాగే రూ.1.10 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ నరేందర్, అతని భార్య, తల్లి ఖాతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. వీటితో పాటు 51 తులాల బంగారం, రూ.1.98 కోట్ల విలువైన స్థిరాస్తులను గుర్తించారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 6.07 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ నివాసంపై ఏసీబీ సోదాలు.. కోట్ల రూపాయల నగదు స్వాధీనం
నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్‌పై నమోదైన కేసులో భాగంగా ఆయన నివాసంపై ఏసీబీ దాడులు నిర్వహించింది.. ఈ దాడుల్లో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి.
ఇంట్లో… pic.twitter.com/2IUipZKnbv
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2024