Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడం కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో నగరంలో ఈ నెల 5వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.
గోషామహాల్ అలస్క జంక్షన్లో 1వ తేదీన డీసీఎం ఢీకొని ఒక వ్యక్తి, 2వ తేదీన తార్నాకలో ఆర్టీసీ బస్ కింద పడి ఒక మహిళ, 3వ తేదీన రాత్రి ఎన్టీఆర్ మార్గ్‌లో రాంగ్ రూట్లో హెల్మెట్ లేకుండా వస్తూ కార్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అయితే హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలతో బయటపడేవారని నగర అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి హెల్మెట్ లేని ప్రయాణం, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు విశ్వప్రసాద్ తెలిపారు. హెల్మెట్ లేని వారికి రూ. 200, రాంగ్ రూట్ డ్రైవింగ్‌కు రూ. 2 వేల జరిమాన విధిస్తామని అదనపు సీపీ తెలిపారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అదనపు సీపీ సూచించారు.
ఇవి కూడా చదవండి..
Anasuya | వనపర్తిలో నటి అనసూయ సందడి..
Life style | బాత్రూమ్ కంపు కొడుతోందా.. ఈ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..!
Srisailam | శ్రీశైలంలో కార్తీక సోమవార పూజలు.. పుష్కరిణి వద్ద వైభవంగ లక్ష దీపార్చన