Srisailam | శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రంలో పరమశివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో శాస్ర్తోక్త పూజలు ఘనంగా జరిపిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. కార్తీకమాసంలో తొలి సోమవారం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంకాలం పుష్కరిణి వద్ద లక్షదీపార్చన మరియు పుష్కరిణికి దశవిధ హారతులను జరిపించారు.
Srisailam Karthikam1
ఈ కార్యక్రమానికి ప్రతి ఏడాది వేల సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొంటారని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వీరన్న, మార్కండేయశర్మ అధికారులు సిబ్బందితోపాటు పీఆర్ఓ శ్రీనివాసరావు, శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్‌కుమార్, ఈఈ నర్సింహ్మరెడ్డి, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
1. ఓంకార హారతి : పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరమే ఓంకారం. ఈ ఓంకార హరతిని దర్శించడం వలనకష్టాలన్నీ నివారించబడి సకలు శుభాలు కలుగుతాయి.
2. నాగ హారతి : నాగ హారతిని దర్శించడం వలన సర్పదోషాలు తోలిగి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
3. త్రిశూల హారతి : త్రిశూల హారతిని దర్శించడం వలన అకాల మరణాలు తోలిగి గ్రహ దోషాలు నివారించబడుతాయి.
4. నంది హారతి : నంది హారతిని దర్శించడం వలన భయం దుఖం తోలిగిపోయి ఆనందం నూతనోత్సాహం లభిస్తాయి.
5. సింహ హారతి : సింహ హారతిని దర్శించడం వలన శత్రు భాదలు తోలిగి మనో ధైర్యం పెరుగుతుంది.
6. సూర్య హారతి : సూర్య హారతిని దర్శించడం వలన ఆరోగ్యం చేకూరి దీర్ఘాయుశ్సు లభిస్తుంది.
7. చంద్ర హారతి : చంద్ర హరతిని దర్శించడం వలన మనశ్సుద్ది కలిగి ఈర్ష్య అసూయ ద్వేషాలు తొలిగిపోతాయి.
8. కుంభ హారతి : కుంభ హారతిని దర్శించడం వలన కోరుకున్న కోర్కెలు నెరవేరి సంపదలు కలుగుతాయి.
9. నక్షత్ర హారతి : నక్షత్ర హారతిని దర్శించడం వలన జాతక దోషాలు తొలిగి చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది.
10. కర్పూర హారతి : కర్పూర హారతిని దర్శించడం వలన పాపాలన్ని తొలిగి యఙ్ఞఫలంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.