Life style | బాత్రూమ్ కంపు కొడుతోందా.. ఈ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..!
Life style : మనం ఎంత శుభ్రం చేసినా సరే బాత్రూమ్ నుంచి గలీజ్ వాసన వస్తుంటుంది. ఈ వాసన తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు ఈ దుర్వాసన కారణంగా వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తుందంటే దానిలో బ్యాక్టీరియా లాంటివి పెరుగుతున్నాయని అర్థం. కాబట్టి బాత్రూమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. మరి బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
Life style : మనం ఎంత శుభ్రం చేసినా సరే బాత్రూమ్ నుంచి గలీజ్ వాసన వస్తుంటుంది. ఈ వాసన తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు ఈ దుర్వాసన కారణంగా వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తుందంటే దానిలో బ్యాక్టీరియా లాంటివి పెరుగుతున్నాయని అర్థం. కాబట్టి బాత్రూమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. మరి బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
వెంటిలేషన్ ఉండాలి
బాత్రూమ్ నుంచి దుర్వాసన రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో వెంటిలేషన్ సమస్య కూడా ఒకటి. బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తూ ఉంటే ముందుగా వెంటిలేషన్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. బాత్రూమ్ లోకి వెంటిలేషన్ ఉంటే గాలి బయటకు వెళ్తూ వస్తూ ఉంటుంది. కానీ చాలా ఇళ్లలో బాత్రూమ్కు వెంటిలేషన్ సరిగా ఉండట్లేదు. అలాంటప్పుడు బాత్రూమ్కు ఎగ్జాస్ట్ ఫ్యాన్, విండో ఏర్పాటు చేసుకోవాలి.
తరచూ శుభ్రం చేయాలి
బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే రెండు రోజలుకు ఒకసారైనా శుభ్రం చేయాలి. అదేవిధంగా కేవలం నీళ్లతో కాకుండా బాత్రూమ్ను క్లీన్ చేయడానికి క్లీనింగ్ ఏజంట్లను ఉపయోగించాలి. దాంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
ఫ్లష్ ట్యాంక్‌ను క్లీన్ చేయాలి
వెంటిలేషన్ సరిగ్గా ఉండి, బాత్రూమ్ క్లీన్ చేసినా దుర్వాసన వస్తూ ఉందంటే అందుకు ఫ్లష్ ట్యాంక్ కూడా కారణమై ఉండవచ్చు. ఎందుకంటే ఫ్లష్ ట్యాంకులో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. దానివల్ల బ్యాక్టీరియా పెరగడం, నాచు పట్టడం లాంటివి జరుగుతాయి. కాబట్టి తరచూ ఫ్లష్ ట్యాంకును శభ్రం చేస్తుండాలి.
ప్లంబింగ్ చెక్ చేసుకోవాలి
ప్లంబింగ్ లోపాల కారణంగా కూడా బాత్రూమ్ నుంచి దుర్వాసన వస్తుంది. సింక్స్, బ్రాత్రూమ్లో నిరంతరం దుర్వాసన వస్తూ ఉంటే ప్లంబర్ని పిలిపించి ఒకసారి ప్లంబింగ్ను చెక్ చేయించాలి. సింక్ గొట్టాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల కూడా ఇలా దుర్వాసన వస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

