Anasuya | వనపర్తి : వనపర్తిలో సినీనటి అనసూయ భరద్వాజ్ సందడి చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాసం ఫ్యాషన్స్ 15వ షోరూంను షాపింగ్‌మాల్ డైరెక్టర్లు కాసం నమశ్సివాయ, కాసం మల్లికార్జున్, కాసం కేదారీనాథ్, కాసం శివప్రసాద్‌తో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. అందాల తార రాకతో చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. షాపింగ్ మాల్ వద్ద సందడి నెలకొన్నది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.. అధునాతన కలెక్షన్స్‌తో నిత్య నూతన వెరైటీలతో కాసం ఫ్యాషన్స్ పేరుగాంచిందని తెలిపారు. వనపర్తిలో స్టోర్‌ను ప్రారంభించడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Beauty tips | జుట్టు బాగా రాలుతోందా.. అయితే ఈ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..!
RBI-Rs 2000 | 98.04 శాతం రూ.2000 నోట్లు తిరిగి వచ్చేశాయ్.. ఆర్బీఐ..!
Srisailam | శ్రీశైలంలో కార్తీక సోమవార పూజలు.. పుష్కరిణి వద్ద వైభవంగ లక్ష దీపార్చన