Harish Rao | సెక్రటేరియట్లో మా రిటైర్డ్ ఉద్యోగులు పోయి ధర్నా చేస్తున్నరు. మేం దాచుకున్న పైసలు మావి మాకియ్యమంటే 15 శాతం కమీషన్ అడుగుతున్నరని చెబుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
ఈ విషయమై హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్ని రోజులు ఈ సెక్రటేరియట్ చుట్టూ తిరగాలని ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పోయి ధర్నాలు చేసే పరిస్థితి ఉంది. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు డబ్బులు రావడం లేదు. వాళ్లు దాచుకున్న జీపీఎఫ్ పైసలు రావడం లేదు. డీఏలు, పీఆర్సీలు రావడం లేదు. నేడు యావత్ ఉపాధ్యాయ, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.
మీరు కలిసినప్పుడు, తిరిగినప్పుడు రిటైర్డ్ ఉద్యోగులను తప్పకుండా కలవండి. ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని గుర్తు చేయండి. నా దృష్టిలో ఒక్కొక్క ఉపాధ్యాయుడు, ఒక్కో ఉద్యోగి వాళ్ల ఓట్లు కాదు.. పది పది ఓట్లు బీఆర్ఎస్ వేయించడానికి తయారుగా ఉన్నారు వాళ్లు. ఎందుకంటే ఇయ్యాళ్ల మోసం చేసిర్రు.. భారతదేశంలో ఆరు డీఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రమేదన్నా ఉన్నదా అంటే.. అది ఒక్క తెలంగాణనే. నాలుగేండ్లయినా పీఆర్సీ రాని పరిస్థితి ఉందంటే..? అది ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనేనన్నారు హరీశ్ రావు.
గత సెక్రటేరియట్ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇట్లా ఉద్యోగస్తులు పోయి ఫైనాన్సియల్ మినిస్టర్ చాంబర్ ముందు ధర్నా చేసిన చరిత్ర ఈ రాష్ట్రానికి లేదు. అది ఉమ్మడి రాష్ట్రంలోనైనా, తెలంగాణ రాష్ట్రంలోనైనా మా బిల్లులు మాకియ్యండి. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిలు ఇవ్వండి.. మా జీపీఎఫ్ పైసలియ్యండి.. అంటూ ఫైనాన్స్ మినిస్టర్ చాంబర్ ముందే ధర్నా చేస్తే ఈ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క సిగ్గుతో తలదించుకోవాలి.. అని హరీశ్ రావు అన్నారు.
సెక్రటేరియట్లో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ వద్దకు వెళ్లి రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు
మేము దాచుకున్న డబ్బులు మాకు తిరిగి ఇవ్వడానికి భట్టి భార్య 15 శాతం కమిషన్ అడుగుతున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు
దేశంలో ఆరు డీఏలు పెండింగ్లో ఉన్న ఒకే ఒక్క… https://t.co/ZbPbjrioqB pic.twitter.com/UsZOpd3hvT
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2026
Urvashi Rautela | ఊర్వశి రౌతేలా వర్సెస్ ఏఐ కంపెనీ.. రూ.7 వేల కోట్ల దావా, సీఈఓ ఘాటు కౌంటర్తో రచ్చ!