కొత్తగూడెం గణేష్ టెంపుల్, సెప్టెంబర్ 30 : జిల్లా జనరల్ ఆస్పత్రికి సంబంధించిన అంబులెన్స్ ను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా మోహన్ ప్రైవేట్ పనులకు వాడుకుంటూ విధులను దుర్వినియోగ పరుస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటలు రోగులకు అందుబాటులో ఉండాల్సిన అంబులెన్స్ లో జిజిహెచ్ సూపరింటెండెంట్ తన ప్రైవేట్ పనుల కోసం రోజుకు నాలుగు నుండి ఐదు సార్లు గణేష్ టెంపుల్ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. దీనికి కారణం గణేష్ టెంపుల్ ప్రాంతంలో సదరు సూపరింటెండెంట్ కు ప్రైవేట్ క్లినిక్ ఉండడమే. ప్రైవేట్ క్లినిక్ కు ప్రభుత్వ వాహనాన్ని వాడుకుంటూ రోడ్డుపైనే ఆ వాహనాన్ని గంటలకు పైగా నిలిపివేసి తన ప్రైవేట్ క్లినిక్ లో వైద్యం చేస్తున్నాడని విమర్శలు ఉన్నాయి. బాధ్యతాయుతమైన అధికారి బాధ్యతలను మరిచి తన సొంత పనులకు ప్రభుత్వ వాహనాన్ని వాడుకోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది.

ప్రైవేట్ పనులకు ప్రభుత్వ వాహనం