అర్వపల్లి, సెప్టెంబర్ 30 : జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని అడివెంల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, రిటైర్డ్ ఎంపీడీఓ పెరుమాళ్ల వెంకటయ్య అనారోగ్యంతో మంగళవారం మరణించాడు. విషయం తెలిసిన పార్టీ జిల్లా నాయకులు, మాజీ ఎంపీపీ & జడ్పీటీసీ దావుల మనీషా వీరప్రసాద్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్పంచులు కలకోట్ల శైలేందర్, కర్నాటి వెంకన్న, పార్టీ నాయకులు చిర్రబోయిన వెంకన్న, ఉప సర్పంచులు వజ్జే చిన్న రవి, లింగంపల్లి రవీందర్, నాయకులు బంటు యాదగిరి, మంగ లక్ష్మయ్య, మెడిబోయిన నాగార్జున నివాళులర్పించిన వారిలో ఉన్నారు.