Koffee with Karan | వన్ లాస్ట్ టైం.. చివరి కప్పు కాఫీతో వీడ్కోలు పలకనున్న కరణ్ జోహార్!
Koffee with Karan | భారతీయ టెలివిజన్, ఓటీటీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) త్వరలోనే ముగియనుంది.
Koffee with Karan | భారతీయ టెలివిజన్, ఓటీటీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) త్వరలోనే ముగియనుంది. సుదీర్ఘకాలంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ఐకానిక్ షో తాజాగా తన చివరి సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 22 ఏళ్ల ప్రయాణం, 8 విజయవంతమైన సీజన్లు, 161 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు సీజన్ 9తో ఫైనల్ రౌండ్‌కు సిద్ధమైంది. ఈ షోకి సంబంధించిన తొమ్మిదవ మరియు ఆఖరి సీజన్‌ను అక్టోబర్ 14 నుండి ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ దర్శకుడు, హోస్ట్ కరణ్ జోహార్ అధికారికంగా ప్రకటించారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో కరణ్ జోహార్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. 2004లో తన తండ్రి యశ్ జోహార్‌కు ఈ టాక్ షో ఐడియా చెప్పిన క్షణాలను గుర్తుచేసుకుంటూ, అప్పట్నుంచి ఇప్పటివరకు సాగిన ప్రయాణాన్ని ఆయన నెమరువేసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖుల సీక్రెట్స్, వివాదాలు, సరదా సంభాషణలతో పాప్ కల్చర్‌పై చెరగని ముద్ర వేసిన ఈ షోకు చివరిసారిగా ‘ఒక కప్పు కాఫీ’తో వీడ్కోలు పలకనున్నారు. మరోవైపు ఈ ముగింపు సీజన్లో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్‌తో పాటు విజయ్ దేవరకొండ పాల్గోనబోతున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖానలపై ఎందుకు లేదు? : మన్నె క్రిశాంక్
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

