Nampally | హైదరాబాద్ : నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లిలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో మల్లేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రహదారి విస్తరణ కోసం ఆరు దుకాణాలను జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చేశారు. ఈ కూల్చివేతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
నాంపల్లి నియోజకవర్గంలో రహదారి పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రహదారి పనుల కారణంగా తవ్విన ఓ గుంతలో ఓ వృద్ధుడు పడిపోయాడు. బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రహదారిపై గుంతలు, తనకు తగిలిన గాయంపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌కు వృద్ధుడు చెప్పాడు. దీంతో సోమవారం ఫిరోజ్ ఖాన్ రహదారి పనులను పరిశీలించేందుకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌తో పాటు ఆయన వర్గీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇరు వర్గాల మధ్య పరస్పరం రాళ్ల దాడి జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
మల్లేపల్లి ఎక్స్ రోడ్డు దగ్గర రోడ్డు వైండింగ్ కోసం ఆరు దుకాణాలను కూల్చివేసిన జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ అధికారులు. pic.twitter.com/h7lXe2WoVo
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2024
ఇవి కూడా చదవండి..
Rachakonda | రాచకొండ కమిషనరేట్‌లో 27 మంది ఇన్స్పెక్టర్లు ట్రాన్స్ఫర్
Hyderabad Metro | మెట్రో మార్గం గజిబిజి.. గందరగోళంగా రెండో దశ కారిడార్లు
TGS RTC | దసరాకు 6,304 ప్రత్యేక బస్సులు.. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు: వీసీ సజ్జనార్