హైదరాబాద్: హైదరాబాద్ ట్రైకమిషనరేట్లలో ఒకటైన రాచకొండ (Rachakonda) పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 27 మంది సీఐలను ట్రాన్స్ఫర్ చేస్తూ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీచేశారు. చైతన్యపురి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఉన్న జీ.వెంకటేశ్వర్లును కుషాయిగూడ డీఐగా బదిలీచేశారు. ఆ స్థానంలో రాచకొండ పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ జీ.వెంకటేశ్వర రావును నియమించారు. వనస్థలిపురం ఎస్‌హెచ్‌వో అశోక్ రెడ్డిని సైబర్ క్రైం పీఎస్‌కు బదిలీచేశారు. ఆయన ప్లేస్‌లో భూక్యా రాజేశ్‌ను ఎస్‌హెచ్‌వోగా ట్రాన్స్ఫర్ చేశారు.