హైదరాబాద్ : కారులో అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని(Jaggery) ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. వివ రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బేగం బజార్ నుంచి అచ్చంపేటకు బెల్లాన్ని తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎస్ఎఫ్ టీం మాటువేసి తుక్కుగూడ(Thukkuguda) ప్రాంతంలో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 960 కిలోల బెల్లం, 100 కేజీల అల్లం 4.5 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ బాదావత్ పాండు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, చాకచక్యంగా వ్యవహరించి బెల్లం, నాటుసారా పట్టుకున్న సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలహసన్ రెడ్డి అభినందించారు. ఈ దాడిలో ప్రదీప్ రావు, సీఐ భిక్ష, ఎస్ఐ బాలరాజు, సిబ్బంది కృష్ణ, యాదగిరి, సతీష్ ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.