Savitribai Phule | శనివారం సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సావిత్రి బాయి ఫూలే చిత్ర పటం వద్ద పూలు చల్లి ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం తలసాని మాట్లాడుతూ.. మహిళా విద్యకు పునాది వేసి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రి బాయి ఫూలే అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, వాసుదేవ రెడ్డి తదితరులు ఉన్నారు.
Jogu Ramanna | రైతు సమస్యలపై మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఆందోళన
Khammam Rural : 32 వార్డులు 45 వేల మంది ఓటర్లు.. ఈఎంసి ఓటరు డ్రాఫ్ట్ జాబితా విడుదల
Bonakal : అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం పంపిణీ