RS Praveen Kumar | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సచ్చిపోవాలి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చనిపోవాలని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. అతన్ని ప్రోత్సహిస్తున్న సీఎం రేవంత్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడికి కాంగ్రెస్ నేతలు గుంపులుగా వెళ్లే క్రమంలో తాము కేసీఆర్ చావును కోరుకుంటున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తల పొగరు వ్యాఖ్యలు చేశారని తెలిసిందే.
Karimnagar | సంక్షోభంలో సంక్షేమం.. కరీంనగర్లో అధికారి, సిబ్బంది మధ్య సమన్వయలోపం
Vemulawada | వేములవాడలో నిండుకున్న లడ్డు ప్రసాదం..!
బూర్గంపహాడ్‌లో పెచ్చుమీరుతున్న సైబర్ మోసాలు