Chirumarthi Lingaiah | రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి. బూతుల పురాణం మాట్లాడడమే సరిపోతుంది. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టగానే రేవంత్ రెడ్డికి లాగు తడిచి పోయింది. అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే వైన్స్ లు బంద్ చేయాలి. రేవంత్ రెడ్డి ఇంట్లో ఉండే బంధువులు మందు తాగడం లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అవడం ఖాయం. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతం అవడం ఖాయం. కేటీఆర్ కంటే అందగాడివా..? నువ్వు రేవంత్ రెడ్డి. మేకపోతులా ఉండే నువ్వు కేటీఆర్ అందం గురించా మాట్లాడేది..? అని ప్రశ్నించారు.
హరీష్ రావు ఆరడుగుల బుల్లెట్, హరీష్ రావు గురించా నువ్వు మాట్లాడేది. తెలంగాణ బాపు కేసీఆర్‌ను పట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నావు. కేటీఆర్‌ను పట్టుకొని నీ అవ్వా అని మాట్లాడతవా. బూతులు తిట్టే వాడు మా ఊర్లో ఒకడు ఉన్నడు, వాడికి నీకు పోటీ పెడతాం. రేవంత్ రెడ్డి భాష చూస్తుంటే సొంత మనవడే భయపడేలా ఉన్నాడు. పిట్టలదొర కంటే హీనంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కేసీఆర్‌కు నాలుగున్నర కోట్ల మంది దీవెనలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ చావే కోరుకుంటారన్నారు.
Jagadish Reddy | రేవంత్‌రెడ్డి కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు : జగదీశ్‌రెడ్డి
Bus overturns | మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు : వీడియో
Hrithik Roshan | పెళ్లి వేడుకలో కుమారులతో కలిసి స్టెప్పులేసిన హృతిక్ రోషన్… వీడియో వైరల్