KTR | బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ సర్వే కూడా చెబుతోంది : కేటీఆర్
KTR | ఒక్క ఎన్నికల్లో అన్ని అబద్ధం మాటలు చెప్పిప్రజలను గోల్మాల్ చేసి దొంగోట్లతో గెలిచినవ్ నువ్వు. తెలంగాణ ప్రజల మీదికి తుపాకి తీసుకుపోయిన నీకే ఇంతుంటే.. తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
KTR | మొలవనే మొలవదు అనుకున్న రాష్ట్రాన్నే మొలిపించిన పార్టీ మాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మొలవనే మొలవదన్నారు.. అట్లాంటి ఒక రాష్ట్రాన్నే మొలిపించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రేవంత్ రెడ్డికి హైట్ ఒక్కటే తక్కువనుకున్నా.. బుర్ర కూడా తక్కువేనని ఈ మధ్యనే తెలిసిందన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. మీ నాయకుడు రాహుల్ గాంధీ వరుసగా 2014 నుంచి ఇప్పటిదాకా మూడుసార్లు ఎన్నికల్లో ఒడిపోయారు. అయితే ఖతం అయిపోయిందా..? కాంగ్రెస్. అట్లాంటిది ఇంత పవర్ ఫుల్ పార్టీ.. రాష్ట్రం తెచ్చిన పార్టీ.. అంత పవర్ ఫుల్ నాయకుడు.. ఒక్క ఎన్నికల్లో అన్ని అబద్ధం మాటలు చెప్పిప్రజలను గోల్మాల్ చేసి దొంగోట్లతో గెలిచినవ్ నువ్వు. తెలంగాణ ప్రజల మీదికి తుపాకి తీసుకుపోయిన నీకే ఇంతుంటే.. తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలేనని హెచ్చరించారు.
అంత సిపాయి అయితే మొలకెత్తనీయ అంటున్నడు కదా.. రాష్ట్రంలో ఎన్నికలు పెట్టుమను. ఉప ఎన్నికలు పెడ్తడా.? జిల్లా పరిషత్ ఎన్నికలు పెడ్తరా..? లేకపోతే శాసనసభ మొత్తం రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలకు పోతడా..? పొమ్మను చూస్తా.. ఎందుకుంటే ఆయనకు తెలుసు.. రేవంత్ రెడ్డి సర్వేనే చెబుతోంది. మొత్తం రెండున్నరేండ్లు అయిపోయింది. చివరి సంవత్సరం ఎలాగో ఎన్నికలే.. మిగిలింది 18 నెలలు. ఈ 18 నెలల్లో ఏం చేయొచ్చు అని చెప్పి ఆయన సర్వే చేయించుకున్నడు. ఆయన ఒక్కడే చేయలేదు.. ఇంకో మూడు సర్వేలు కూడా ఉన్నాయి. మొత్తం 4 సర్వేలు బయటకు వచ్చినయి. 4 సర్వేలు ఘంటాపథంగా చెప్తున్నయి.. రేవంత్ రెడ్డి సర్వే కూడా స్వయంగా చెప్పింది. 78 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ సర్వే చేయించుకుంటే అందులో కూడా వచ్చిందన్నారు కేటీఆర్.
రేవంత్ రెడ్డికి హైట్ ఒక్కటే తక్కువ అనుకున్నా బుర్ర కూడా తక్కువే
రాహుల్ గాంధీ 2014 నుండి 3 సార్లు ఓడిపోయాడు అయితే దేశంలో కాంగ్రెస్ పని అయిపోయినట్లేనా!
రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ లాంటి పవర్ ఫుల్ పార్టీ ఒక్క ఎన్నికలో మీ దొంగ ఓట్లతో ఓడిపోతే అయిపోయినట్లా
తెలంగాణ ప్రజల మీదకి… https://t.co/7HPpSBbHi9 pic.twitter.com/l6CZCpwNvs
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2026
Read Also :
PM Modi | మా దేశం అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానం : ప్రధాని మోదీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం : రేగా కాంతారావు
Riddhi Chauhan: 300 మంది అమెరికా నేవీ క్యాడెట్స్‌కు లీడర్‌గా భారతీయ విద్యార్థిని
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

