KTR | ఇందిరా పార్క్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లను చేస్తా అన్నడు రేవంత్ రెడ్డి. చేవెళ్లలో ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్‌లో 18 శాతం ఎస్సీలకు, 12 శాతం ఎస్టీలకు.. మొత్తం 30 శాతం ప్రభుత్వం కాంట్రాక్టుల్లో మీకే ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిండు. కామారెడ్డిలో ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం వాటా అని చెప్పిండు. అంటే మొత్తం 72 శాతం వాటా.. ఈ రెండున్నరేళ్లలో రూపాయి టెండరు పిలిస్తే 72 పైసలు మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే రావాలి. రేవంత్ రెడ్డి వచ్చాక 4 లక్షల కోట్టు అప్పు చేసిండు.. 4 లక్షల కోట్ల అప్పులో మొత్తం నాలుగు రూపాలన్నా బీసీ,ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా.. చెప్పే దమ్ముందా..? శ్వేత పత్రం ఇచ్చి దమ్ముందా..? అని ప్రశ్నించారు.
తెల్లారి లేస్తే నోటికొచ్చిన సొల్లు వాగుడు.. నోటికొచ్చిన పనికిమాలిన మాటలు.. ఎన్నికలకు ముందేమో డిక్లరేషన్ల వరద.. ఇప్పుడు నోరు తెరిస్తే బురద.. అది తప్ప ఏం లేదు..బూతులు, బురద తప్ప ఒక్కటంటే ఒక్క పనిచేసిండా.. ఆలోచన చేయండన్నారు కేటీఆర్. కేసీఆర్ ఏమో అధికారులకు మీరు రొటీన్ ఫైళ్లు నా దగ్గరకు తీసుకురాకండి..చిన్న స్థాయిలో ఉండే చిన్న కాంట్రాక్టర్లను ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కాపాడండి.. పైకి తీసుకురండి అని ఆయన అప్పజెప్తే నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పి వచ్చి ఎవరికి ఇస్తున్నవ్ ఇయ్యాళ్ల కాంట్రాక్టులు…? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఆ ఇద్దరికే కాంట్రాక్టులు..
ఇవాళ కాంట్రాక్టులు ఇస్తున్నది కేవలం ఇద్దరికే.. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తున్నయంటే రేవంత్ రెడ్డి బావమరిదికి .. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకుకు.. తప్ప ఇంకో వేరే మనిషికి వచ్చిందా..? వేరే ఏ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుడికి వచ్చిందా.. మీరు ఆలోచన చేయాలన్నారు. మరి వాళ్లకే ఎందుకొస్తన్నయ్.. వాళ్లకు మాత్రమే కాదు. బీజేపీ వాళ్లకు కూడా వస్తున్నయ్. మన తెలంగాణలో కాంట్రాక్టులు బీజేపీ ఎంపీలకు కూడా వస్తున్నయ్. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఒక్క బీజేపీ ఎంపీకి కాంట్రాక్టులు రాలేదు. కానీ ఇయ్యాళ రేవంత్ రెడ్డి వచ్చినంక యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడితే ఒక్క ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీకి కాంట్రాక్టు రాలే . కానీ బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డికి మాత్రం బ్రహ్మాండంగా వచ్చినయ్. అట్లాగే రేవంత్ రెడ్డి రోడ్లు టెండర్లు పిలిస్తే ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సోదరుడికి రాదు.. కానీ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు మాత్రం రూ.1300 కోట్ల కాంట్రాక్టు వస్తదని మండిపడ్డారు.
ఢిల్లీకి డబ్బులు పంపకపోతే సీటు గాయబ్.. అందరికీ తెలుసు.. మీకు.. నాకు.. వాళ్ల మంత్రులకు కూడా తెలుసు. సరే గద్దెనెక్కిండు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అన్నడు. ప్రతీ సంవత్సరం ఒక్కో పేద కుటుంబానికి రెండున్నర లక్షలు రూపాయలిస్తా అన్నడు.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నడు. మరి నూరు రోజులంటివి.. ఇన్ని కథలు చెప్తివి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ప్రశ్నించారు.
2028లో మన ప్రభుత్వమే వస్తుంది..
రాష్ట్రంలో మక్కలు, వడ్లు కొనుగోలు కాక రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇవాళ ఏ ఒక్క ఊరికైనా కాంగ్రెస్ వాళ్లు వెళ్లే ధైర్యం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టి, బొంద పెట్టాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వదిలిపెట్టకుండా ఎట్లా పోరాడారో, బడుగుల సమస్యలపై కూడా అలాగే పోరాడతామన్నారు. బడుగు వర్గాల సమస్యలపై అధికారులకు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఒకవేళ వాళ్ళు వినకపోతే భవిష్యత్తులో జంతర్ మంతర్ లేదా ఢిల్లీ వేదికగానైనా పోరాడుతామన్నారు. 2028లో తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, నాడు 10 వేల మంది కాదు, దాదాపు 50 వేల మంది బడుగు, బలహీన వర్గాల యువకులను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే బాధ్యతను కేసీఆర్ తీసుకుంటారని కేటీఆర్ అభయమిచ్చారు.
This Weekend OTT | ‘జెట్ లీ’, ‘కర’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాలివే!
Rajamouli | ‘వారణాసి’కి మళ్లీ లీకుల బెడద.. జక్కన్న మౌనం వెనుక అసలు వ్యూహం ఏంటి?
Transgender Influencer: మున్నిపల్ ఎన్నికల్లో గెలిచిన ట్రాన్స్‌జెండర్ ఇన్ఫ్లూయెన్సర్