కోల్‌కతా: బెంగాల్ క్రికెటర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడే వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ అరెస్టయ్యాడు. ఒక అమ్మాయిని ప్రేమించి పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమే గాక ఆమెను లైంగికంగా వాడుకుని వదిలేశాడని అతడిపై కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే.. మూడున్నరేండ్లుగా పోరెల్, కర్నాటకకు చెందిన మెడికో ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ కలిసి విదేశాలకూ వెళ్లారు. అయితే పెండ్లి చేసుకుంటానని చెప్పిన పోరెల్.. తనను శారీరకంగా వాడుకున్నాడని, కానీ కొంతకాలంగా పెండ్లి ప్రస్తావన తీసుకువస్తే అతడు మొహం చాటేస్తున్నాడని బాధితురాలు ఈ ఏడాది జూన్ 23న మోగ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసింది. యువతి ఫిర్యాదు మేరకు చందానగర్‌లోని పోరెల్ నివాసానికి పలుమార్లు వెళ్లినా పోలీసులకు అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో యువతి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు సోమవారం రాత్రి హుగ్లీలో అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నట్టు హుగ్లీ రూరల్ ఎస్పీ కున్వార్ భూషణ్ తెలిపారు.