ఢిల్లీ: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ విషయంలో రాజీపడని తత్వంతో జట్టులోని ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తాడని మాజీ ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ అన్నాడు. ఐదేండ్ల పాటు జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించిన అతడు ఇటీవలే తన బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిలీప్ మాట్లాడుతూ.. ‘కోహ్లీ విషయానికొస్తే ఫీల్డింగ్‌లో అతడు రాజీపడడు. పవర్ ప్లేలో కవర్స్, షార్ట్ మిడ్ వికెట్ వద్ద ఎంత ఇంటెన్సిటీతో ఫీల్డింగ్ చేస్తాడో ఈ వయసులోనూ డెత్ ఓవర్స్‌లో లాంగాన్, లాంగాఫ్ వద్ద అంతే తీవ్రతతో ఉంటాడు. బంతి తన వద్దకు రాకపోయినా అతడి ప్రయత్నం మాత్రం ఆగదు. బ్యాటర్‌ను రనౌట్ చేయాల్సి వస్తే అతడే ముందుంటాడు. ప్రాక్టీస్ సెషన్స్‌తో పాటు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ ఫీల్డింగ్‌లో తేడా ఉండదు. విరాట్‌ను స్ఫూర్తిగా తీసుకుని జట్టులో తమ శక్తికి మించి రాణించిన ఆటగాళ్లూ ఉన్నారు’ అని చెప్పుకొచ్చాడు.