వాషింగ్టన్ : ఇరాన్ నుంచి ఊహించని విధంగా హత్యాయత్నం హెచ్చరికలు రావడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టర్కీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని అత్యంత రహస్యంగా స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. జూలై 8న జరిగిన ఘటన వివరాలు వెలుగులోకి వచ్చాయి. నాటో సదస్సులో పాల్గొనేందుకు టర్కీ వెళ్లిన ట్రంప్ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
దీంతో ట్రంప్‌తో పాటు ఆయన సిబ్బందిని ఒక క్యాటరింగ్ ట్రక్కు సహాయంతో విమానాశ్రయం టెర్మినల్ నుంచి మరో చిన్న సీ-32ఏ సైనిక విమానానికి రహస్యంగా చేర్చారు. పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని ఒక డెకాయ్(మభ్యపెట్టే సాధనం)గా ఉపయోగించారు. జర్నలిస్టులు, కొద్దిమంది వైట్‌హౌస్ సిబ్బంది సైతం ఈ పెద్ద విమానంలోనే అధ్యక్షుడు ప్రయాణిస్తున్నారని భ్రమపడేలా వ్యూహాన్ని అమలు చేశారు.