నూఢిల్లీ, ఆగస్టు 11 : బంగారం ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. వరుసగా ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి మంగళవారం మరో రూ.1,200 ఎగబాకి రెండు నెలల గరిష్ఠ స్థాయి రూ.1.57 లక్షలు పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ చమురు ధరలు భగ్గుమనడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకుంటున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. జూన్ 12న నమోదైన రూ.1,56,900 తర్వాత ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి అయింది.