సెయింట్ లూయిస్ (యూఎస్ఏ): గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా అమెరికాలో జరుగుతున్న సింక్ఫీల్డ్ కప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద తొలి గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఫస్ట్ రౌండ్లో నల్లపావులతో ఆడుతూ అమెరికా జీఎం సామ్ సేవియన్తో తలపడ్డ ప్రజ్ఞా.. 48 ఎత్తుల తర్వాత గేమ్‌ను డ్రాగా ముగించాడు.
అమెరికా ఆటగాడు ఫాబియానొ కరువానా.. జోర్డాన్ వాన్ (నెదర్లాండ్స్)ను ఓడించడం మినహా మిగిలిన ప్లేయర్లంతా తొలి గేమ్‌ను డ్రాతోనే సరిపెట్టుకున్నారు.