Bandi Sai Bhageerath | హైదరాబాద్ : మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ్‌ను ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని తెలిసిందే. 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ నార్సింగిలోని పోలీసు అకాడమీ వద్ద శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో సాయి భగీరథ్‌ను అరెస్టు చేసినట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. బండి సాయి భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.
కాగా POCSO కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులు10 రోజుల కస్టడీకి కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు నేడు లేదా రేపు మేడ్చల్ కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం.
మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలం
ఈ కేసులో మైనర్ బాధితురాలిని పోలీసులు మేడ్చల్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. బాధితురాలు, ఆమె తల్లి మేజిస్ట్రేట్ ఎదుట తమ వాంగ్మూలం ఇచ్చారు. సుమారు 40 నిమిషాలపాటు వారిద్దరు ఇచ్చిన వాంగ్మూలాలను రికార్డు చేశారు. పోలీసులు బాధితురాలి వాంగ్మూలాలను ఇప్పటికే రెండుసార్లు రికార్డు చేశారు.