Bandi Sai Bhageerath | హైదరాబాద్ : మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని తెలిసిందే. నార్సింగిలోని పోలీసు అకాడమీ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు బండి సాయి భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.
కాగా పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది. సాయి భగీరథ్‌ను మూడు రోజుల విచారణకు అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేశారు.
మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలం :
ఈ కేసులో ఇప్పటికే మైనర్ బాధితురాలిని పోలీసులు మేడ్చల్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. బాధితురాలు, ఆమె తల్లి మేజిస్ట్రేట్ ఎదుట తమ వాంగ్మూలం ఇచ్చారు. సుమారు 40 నిమిషాలపాటు వారిద్దరు ఇచ్చిన వాంగ్మూలాలను రికార్డు చేశారు. పోలీసులు బాధితురాలి వాంగ్మూలాలను ఇప్పటికే రెండుసార్లు రికార్డు చేశారు.
బ్రేకింగ్ న్యూస్
పొక్సో కేసు నిందితుడు బండి భగీరధ్ పోలీస్ కస్టడీకి అనుమతి
మూడు రోజులు విచారణకు అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు ఉత్తర్వులు https://t.co/SeqKamkP5Z pic.twitter.com/2Rl38d6ALX
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2026