Hyderabad | హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ ఈ నెల 15వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజులు పొడిగింపునకు ఎగ్జిబిషన్ సొసైటీ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను కోరారు. నుమాయిష్ పొడిగింపునకు సీపీ సీవీ ఆనంద్ అనుమతి నిరాకరించారు.
84వ నుమాయిష్ జనవరి 3వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. 15వ తేదీ సమీపిస్తుండడంతో నుమాయిష్‌కు ప్రజలు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు నుమాయిష్ కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి..
MLC Elections | సోమవారంతో ముగియనున్న ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు
Hyderabad | మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోసిన యువ డాక్టర్..
Summer | రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు..!