హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలే(Muncipal elections) ప్రధాన ఎజెండాగా నేడు ఉదయం 1 గంటలకు గాంధీ భవన్లో పీసీసీ(PCC) ,పీఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. వచ్చే నెలలో పురపాలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాగైనా గెలువాని ఆ పార్టీ భావిస్తున్నది. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్, తదితరులు హాజరు కానున్నారు.
ఇవి కూడా చదవండి..
Job calendar | జాబ్ క్యాలెండర్ ఏది.. దిల్సుఖ్నగర్లో రోడ్డెక్కిన నిరుద్యోగులు