మలక్‌పేట, జనవరి 7: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ నిరుద్యోగులు దిల్‌సుఖ్‌నగర్‌లో రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలని కోరుతూ జాతీయ రహదారిపై బైఠాయించారు. సరూర్‌నగర్ నుంచి నిరుద్యోగుల సంఘం నాయకుడు మోతీలాల్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం మూడు వందలమంది నిరుద్యోగులు ర్యాలీగా తరలివచ్చి దిల్సుఖ్నగర్ చౌరస్తావద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి మాటలు నమ్మి అప్పులు చేసి కోచింగ్‌లు తీసుకొని ఉద్యోగ పరీక్షలకు ప్రిపేరయ్యామని, ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడం లేదని మండిపడ్డారు. వేలాది రూపాయలు ఖర్చుపెట్టి నేర్చుకున్న సిలబస్‌ను మరచిపోయే పరిస్థితి నెలకొందని, చేయకపోవటంతో తమ జీవితాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆందోళనకారులను మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.