హైదరాబాద్ : డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం వెనుక భాగంలోని మింట్ కాంపౌండ్లో(Mint Compound) ఓ భారీ వృక్షం(Huge tree) కూలింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ముందు ఒక్కసారిగా అటువైపుగా వెళ్తున్న ఆటోపై కూలింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడగా స్థానికులు హాస్పిటల్కు తరలించారు. కాగా, ప్రమాద సమయంలో వెహికిల్స్ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.