Unstoppable Season 4 | నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 4 సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు తమిళ స్టార్ నటుడు సూర్య, మలయాళం స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ వచ్చి సందడి చేశారు.
అయితే తాజాగా ఈ షోకి అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్‌గా రాబోతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 ఈ సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు అల్లు అర్జున్. ఇందులో భాగంగానే ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 4కి వచ్చి బాలకృష్ణతో సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ను నవంబర్ 15న విడుదల చేయనున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌కి సంబంధించి ప్రోమోను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రోమోను పంచుకున్నారు. ఈ ప్రోమోలో బాలకృష్ణ స్క్రీన్‌పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ ఫోటోను చూపించి.. అల్లు అర్జున్‌ని చెప్పమన్నాడు. ఇక మావయ్య గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఓ లీడర్‌గానే కాకుండా ఆయనతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. కాగా దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Hear the answers straight from the man himself! 😎😎
Episode lo entertainment taggede le 🔥 Fire lanti episode Loading.#Unstoppable #iconstar #AlluArjun𓃵 #AlluArjunOnAha #UnstoppableWithNBK #JaiBalayya #UnstoppableAlluArjun #IddaruFiree #PawanKalyan #Prabhas@alluarjun pic.twitter.com/W1JCUfYHl0
— ahavideoin (@ahavideoIN) November 14, 2024