Ranji Trophy | ట్రిపుల్ సెంచరీలతో విధ్వంసం.. రంజీల్లో రికార్డు భాగస్వామ్యం వీళ్లదే..!
Ranji Trophy : ఆద్యంతం ఉత్కంఠ రేపుతున్న రంజీ ట్రోఫీలో గోవా(Goa) బ్యాటర్లు చరిత్ర సృష్టించారు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో రికార్డు స్కోర్ కొట్టేశారు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లను ఎడాపెడా బాదేస్తూ ట్రిపుల్ సెంచరీలతో కదం తొక్కారు.
Ranji Trophy : ఆద్యంతం ఉత్కంఠ రేపుతున్న రంజీ ట్రోఫీలో గోవా (Goa) బ్యాటర్లు చరిత్ర సృష్టించారు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో రికార్డు స్కోర్ కొట్టేశారు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లను ఎడాపెడా బాదేస్తూ ట్రిపుల్ సెంచరీలతో కదం తొక్కారు. స్నేహల్ కౌథంకర్(314 నాటౌట్), కశ్యప బాక్లే(300 నాటౌట్)లు పరుగుల వరద పారిస్తూ మూడొందలు కొట్టేశారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 606 పరుగులు జోడించారు. దాంతో, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 594 పరుగులతో ఉన్న రికార్డు బద్ధలై పోయింది.
రంజీ ట్రోఫీలో గోవా జట్టు విజయానికి చేరువైంది. తొలుత అర్జున్ టెండూల్కర్(5/26) విజృంభణతో అరుణాచల్ ప్రదేశ్‌ను 89 పరుగులకే ఆలౌట్ చేసిన గోవాకు బ్యాటర్లు భారీ స్కోర్ అందించారు. ఓపెనర్లు విఫలమైనా మేమున్నామంటూ స్నేహల్ కౌథంకర్(314 నాటౌట్ 43 ఫోర్లు, 4 సిక్సర్లు), కశ్యప బాక్లే(300 నాటౌట్ 39 ఫోర్లు, 2 సిక్సర్లు)లు వీరకొట్టుడు కొట్టారు.
🚨 Record Alert
Goa batters Kashyap Bakle (300*) & Snehal Kauthankar (314*) have registered the highest-ever partnership in #RanjiTrophy history!
An unbeaten 606 runs for the 3rd wicket in the Plate Group match against Arunachal Pradesh 👏
Scorecard: https://t.co/7pktwKbVeW pic.twitter.com/9vk4U3Aknk
— BCCI Domestic (@BCCIdomestic) November 14, 2024
ఆకలిగొన్న పులుల్లా బ్యాట్లకు పని చెప్పిన ఈ ఇద్దరూ అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీళ్ల విధ్వంసానికి గోవా స్కోర్‌బోర్డు పరుగులు తీసింది. ఇద్దరూ ట్రిపుల్ సెంచరీలతో చెలరేగగా గోవా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 727 రన్స్ కొట్టింది. దాంతో,643 పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పట్టు
రికార్డు భాగస్వామ్యాలు ఎవరివంటే.. కశ్యప బాక్లే, స్నేహల్ కౌథంకర్ (గోవా)- 606 నాటౌట్, అరుణాచల్ ప్రదేశ్‌పై. 2. స్వప్నిల్ సుగాలే – అంకీత్ బవనె(మహారాష్ట్ర) 594 నాటౌట్- 2016/17లో ఢిల్లీపై. 3. విజయ్ హజారే, గుల్ మొహమ్మద్(బరోడా) – 577 పరుగులు, 1946/47లో హోల్కర్‌పై.
ఇవి కూడా చదవండి
- Imane Khelif | నేను అమ్మాయినే.. ఇక మనం కోర్టులో కలుద్దాం
- Nuclear Weapon: అణు బాంబులు తయారు చేస్తున్న ఉక్రెయిన్ !
- Anand Mahindra | ప్రింటింగ్ మెషీన్ దోశ.. ఆకట్టుకుంటున్న వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

