NSUI | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 13 : కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యూఐ నాయకుడు ఎండీ సల్మాన్ రాజీనామా చేసినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 12 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘంలో పని చేసిన నాకు సరైన గౌరవం ఇవ్వకపోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.
దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రొత్సహిస్తున్న నాయకులు నిజమైన కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతానని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Konda Surekha | కోర్టుకు హాజరైన కొండా సురేఖ.. 27కు విచారణ వాయిదా
Telangana | విద్యార్థినుల నిరసన.. కాంగ్రెస్ 420 హామీలపై ప్రియాంక గాంధీకి పోస్టుకార్డులు..
MLC Kavitha | ఎమ్మెల్సీ కవితకు అపురూపంగా గాజులు తొడిగిన పూసలక్క