Sabitha IndraReddy | రైతులేమన్నా గానీ రాజకీయాలే ముఖ్యమన్నట్టు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రైతుల గురించి ఆలోచన లేదు, చదువుకునే యువకుల గురించి ఆలోచన లేదు.. గురుకులాల్లో పిల్లలు చనిపోతుంటే ఆలోచన లేదు. గురుకులాల పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నరు. బీదవాళ్లే కదా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన పిల్లలే కదా.. విషాహారం తిని చనిపోతుంటే కనీసం స్పందన కూడా లేదు ఈ ప్రభుత్వానికి అని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి సర్కార్కు అసలు ఏం జరుగుతుంది..? ఎలాంటి చర్యలు తీసుకున్నామన్నా ఆలోచన కూడా లేదు. రైతులు చనిపోతుంటే మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. యూరియా బుక్ చేసుకుంటే నాగ్సాని పల్లెలో ఉన్న రైతుకు కోస్గిలో వచ్చిందట. అక్కడ షాపు దగ్గరికి పోయి తెచ్చుకోవాలట. మరి అక్కడి నుంచి ఇక్కడిదాకా రైతుకు ట్రాన్స్పోర్టేషన్ ఎవరిస్తరు రైతుకు. ఇవన్నీ ఏదో ఒకటి చేయాలనే ఆలోచన లేని పనులన్నారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఎరువు, యూరియా సమస్యలు ఎందుకు రాలేదు. అంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉన్నడు కాబట్టి రైతులకు వర్షం పడే కంటే రెండు నెలల ముందే కేసీఆర్ ప్రణాళిక వేసుకున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గురించి, గురుకుల పిల్లల గురించి, చదువుతున్న యువకుల గురించి ఆలోచన లేదు.. కేవలం రాజకీయమే కావలన్నట్లు ఆలోచిస్తున్నారు
గురుకుల పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు.. విషాహారం తిని పిల్లలు చనిపోతున్నారు అంటే కనీసం స్పందించడం లేదు
రైతులు ఆత్మహత్యలు… pic.twitter.com/skH7j83883
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2026
Medical kits | తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో హోంగార్డులకు మెడికల్ కిట్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ
F-15 Jet: ఎఫ్-15 ఫైటర్ జెట్లో విహరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్
VD x Shouryuv | ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ.. క్రేజీగా అనౌన్స్మెంట్ పోస్టర్!