మెదక్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా నుంచి విధులకు వెళ్తున్న 18 మంది హోంగార్డ్ సిబ్బందికి జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు( SP Srinivas Rao ) మెడికల్ కిట్లు ( Medical kits ) , డ్రైఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధులు అత్యంత బాధ్యతతో కూడుకున్నవని, విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు సుభాష్ చంద్ర బోస్, రంగనాథ్, సీఐ లు సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, ఆర్ఐలు శైలందర్, రామకృష్ణ, ఆర్ఎస్సై నరేష్ ,సిబ్బంది పాల్గొన్నారు.