నెవడా: భారతీయ వైమానిక దళ చీఫ్ , ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. అమెరికాకు చెందిన ఎఫ్-15ఈఎక్స్ ఈగల్ ఫైటర్ విమానం(F-15 Fighter Jet)లో విహరించారు. ఏప్రిల్ 9వ తేదీన నెవడాలో ఉన్న నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ను ఆయన విజిట్ చేశారు. ఎయిర్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్‌తో పాటు అమెరికా వైమానికదళ మేజర్ మాథ్యూ బెన్సన్ కూడా ఈ ఫైటర్ జెట్‌లో సోర్టీలు కొట్టారు. మేజర్ బెన్సన్.. 85వ టెస్ట్ అండ్ ఎవల్యూషన్ స్క్వాడ్రన్‌లో పైలట్‌గా చేస్తున్నారు. అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానం ఇదే.
ప్రస్తుతం ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఈ యుద్ధ విమానంతో అమెరికా పహారా కాస్తున్నది. ఎఫ్-15ఈఎక్స్ ఈగల్ 2 వర్షన్ అత్యాధునికమైంది. ఆధునిక యుద్ధ విధానంలో ఎఫ్-15 సామర్థ్యం గురించి ఎయిర్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు అమెరికా తెలిపింది. అమెరికా పర్యటనలో బ్రిగేడియర్ జనరల్ డేవిడ్ సీ ఎప్పర్సన్తో ఆయన చర్చించారు. ఐఏఎఫ్ బృందంలో ఎయిర్ కమోడోర్ యశ్పాల్ సింగ్ నేగి కూడా ఉన్నారు.