VD x Shouryuv | ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ.. క్రేజీగా అనౌన్స్మెంట్ పోస్టర్!
Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని 'హాయ్ నాన్న' ఫేమ్ యువ దర్శకుడు శౌర్యువ్‌తో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Vijay Devarakonda | టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ‘హాయ్ నాన్న’ ఫేమ్ యువ దర్శకుడు శౌర్యువ్‌తో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం (#VDxShouryuv) కోసం ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులను రంగంలోకి దించుతున్నట్లు విజయ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ కోసం హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు ఎరిక్ డర్స్ట్, అంతర్జాతీయ సినిమాటోగ్రాఫర్ అలెజాండ్రో మార్టినెజ్, ప్రముఖ ఎడిటర్ ప్రవీణ్ ఆంటోనీ, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ సచిన్ లోవలేకర్ వంటి హేమాహేమీలు పనిచేయబోతున్నారు. ‘ఖుషి’ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు కూడా బాణీలు కడుతున్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ భావోద్వేగంగా స్పందిస్తూ, శౌర్యువ్ అద్భుతమైన ఊహాశక్తితో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా సవాల్‌తో కూడుకున్నదని, దీనికోసం తన శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శౌర్యువ్ మొదటి చిత్రం ‘హాయ్ నాన్న’ క్లాస్ మూవీగా గుర్తింపు పొందగా, ఈ కొత్త చిత్రం దానికి పూర్తి భిన్నంగా భారీ యాక్షన్ ఎపిసోడ్లతో గ్లోబల్ స్థాయిలో ఉండబోతోందని చిత్ర బృందం వెల్లడించింది. విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మరియు వైవిధ్యమైన పాత్రతో రూపొందుతున్న ఈ సినిమా ప్రకటన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Vd’s Next
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

