Harish Rao | మంత్రి ఉత్తమ్.. ఉత్త మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి గాలి సోకినట్టుంది. ఉత్తమ్‌కు రేవంత్ రెడ్డి సావాస దోషం పట్టుకుందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం నేల మీద పడుకుని పని చేశాను. ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించారా..? లేదా..? ఉత్తమ్ చెప్పాలన్నారు.
డీపీఆర్ వాపస్ వచ్చి ఏడాది అయినా.. మౌనం ఎందుకు..? మా హయాంలో ఏడు అనుమతులు తెచ్చాం.. రెండేళ్లలో ఒక్క అనుమతి అయినా తెచ్చారా..? అని హరీష్ రావు హరీష్ రావు ప్రశ్నించారు. పాలమూరు ద్రోహులు కాంగ్రెస్ నేతలు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కేసు వేసి అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మండిపడ్డారు. రెండు టన్నెల్స్ బీఆర్ఎస్ హాయాంలోనే పూర్తి అయ్యాయన్నారు.
మిస్టర్ ఉత్తమ్ మీ చేతకాని తనాన్ని మాపై రుద్దుతున్నారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు రెండేళ్ళ క్రితం కొబ్బరికాయ కొట్టి డీపీఆర్ ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. సొంత శాఖపై మంత్రిగా ఉత్తమ్‌కు ఇంకా పట్టు రానట్టుంది. ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటాడోనన్నారు.
ఎస్ఎల్బీసీపై బీఆర్ఎస్ ప్రభుత్వం 1900కోట్లు ఖర్చు పెట్టింది. ఏడు ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి ఫైనల్ అనుమతులు తెచ్చాం. కాంగ్రెస్ హయాంలో 3 డీపీఆర్‌లు వాపస్ వచ్చాయి. రెండేళ్లలో ఉత్తమ్ ఒక్క అనుమతి కూడా తేలేదన్నారు హరీష్ రావు.
సభను కనీసం 15రోజులు జరపాలి..
సభను కనీసం 15రోజులు జరపాలని బీఏసీలో పట్టు పట్టాం. వారం రోజులు జరుపుతామని స్పీకర్ చెప్పారని హరీష్ రావు అన్నారు. వారం తర్వాత మళ్లీ బీఏసీని పిలుస్తామన్నారు. నదీ జలాలపై సభలో బీఆర్ఎస్ కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని బీఏసీలో లేవనెత్తాం . కాంగ్రెస్ వచ్చాక క్వశన్ అవర్ 6 రోజులు మాత్రమే పెట్టారు. ప్రతీ రోజు క్వశ్చన్ అవర్ పెట్టాలని కోరాం. ఖాళీగా ఉన్న 16 హౌస్ కమిటీలు వేయాలని కోరాం. ఎజెండా పంపే పద్దతి సరిగా లేదు. 24గంటల ముందే అజెండా ఇవ్వాలని కోరాం. 15 అంశాలపై సభలో చర్చించాలని పట్టు పట్టామన్నారు.