Musi Victims | కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని నిర్మించేందుకు ఫిబ్రవరి నెలలోనే శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ ప్రభుత్వం రూ.5000 కోట్లతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం పెట్డడంపై ప్రజల నుండి , ప్రజా సంఘాల నుండి, పర్యావరణవేత్తల నుండి, రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా లెక్కచేయడం లేదు. ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మూసీ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ బాధిత మహిళ మాట్లాడుతూ.. కష్టపడి లోన్ తీసుకుని ఇండ్లు కట్టుకున్నాం. లోన్ సగం కూడా తీరలేదు. పిల్లల చదువు కొనసాగుతోంది. ఇటువంటి పరిస్తితుల్లో మీరు ఉన్న పళంగా ఖాళీ చేయమంటే ఎటు పోతాం. మీ నిర్ణయం వల్ల ఇంతమంది పిల్లల భవిష్యత్ రోడ్డు మీద పడిపోతుంది. మేమే నిలబడేందుకు లేనప్పుడు వారినేం చదివిస్తాం. వారికేం ఫీజులు కడతాం.. వాళ్ల చదువులు ఆగిపోతాయి. భవిష్యత్ నాశమైపోతుంది. మీ నిర్ణయం వల్ల ఎవ్వరికీ మంచి జరుగదు. ప్రజల ఇండ్లను కూలగొట్టి మమ్మల్ని రోడ్డుకు ఈడ్చి తన విగ్రహం కట్టమని గాంధీ గారు ఎప్పుడైనా చెప్పారా..? అని ప్రశ్నించారు.
మా ఒక్క అపార్ట్మెంట్లోనే 450కుటుంబాలున్నాయి. కష్టపడి కట్టుకున్న మా ఇండ్లు కూలగొట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టడాన్ని గాంధీ గారు ఒప్పుకుంటారా..? కష్టపడి సంపాదించిన సొమ్ముతో, బ్యాంకులో లోన్లు తీసుకొని ఎంతో ఇష్టంతో ఇల్లు కట్టుకుంటే.. అది కూల్చేస్తే మేమెలా బ్రతికేది..? మేము తీసుకున్న బ్యాంకు లోన్లు కూడా తీరిపోలేదు, మేమెలా బ్రతకాలి..? మిగిలిన బ్యాంకు లోన్లు ఎలా కట్టాలి..? అంటూ మూసీ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈసీ, మూసీ నదుల సంగమం వద్ద ఉన్న పది ఎకరాల భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం 3,279 ఎకరాలు, 10,017 ఇండ్లు, షాపులు సేకరించనున్నారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన భూమిలో మధు పార్క్ రిడ్జ్ అపార్టుమెంట్ కాంప్లెక్స్ లో నివసించే సుమారు 500 కుటుంబాలు ఈ నిర్ణయంతో రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది.
గాంధీ గారు మా ఇండ్లు కూలగొట్టి ఆయన విగ్రహం కట్టమని ఎప్పుడైనా చెప్పారా?
కష్టపడి కట్టుకున్న మా ఇండ్లు కూలగొట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం గాంధీ గారు ఒప్పుకుంటారా?
కష్టపడి సంపాదించిన సొమ్ముతో, బ్యాంకులో లోన్లు తీసుకొని ఎంతో ఇష్టంతో ఇల్లు కట్టుకుంటే అది కూల్చేస్తే మేమెలా… https://t.co/bxOP7OmNGo pic.twitter.com/ewiFfhEQkB
— Telugu Scribe (@TeluguScribe) February 19, 2026
రూ.5 వేల కోట్లతో వేరే ఏమైనా డెవలప్మెంట్ చేయండి..
ఓ విద్యార్థి మాట్లాడుతూ.. స్టాట్యూస్ ఆర్ నాట్ ఏ ఫామ్ ఆఫ్ హానర్..! ఇది చాలా అన్యాయం.. ఇంత మందిని బాధపెట్టి గాంధీ విగ్రహం కట్టడం కరెక్ట్ కాదన్నాడు. ఆ విగ్రహంతో ఏమీ రాదు.. మీకు నిజంగా గాంధీకి మర్యాద ఇవ్వాలి అనుకుంటే ఆ రూ.5 వేల కోట్లతో వేరే ఏమైనా డెవలప్మెంట్ చేయండని ప్రభుత్వానికి సూచించాడు. వారం రోజుల్లో తనకు ఇంటర్ పరీక్షలు ఉన్నాయి.. దీని వల్ల నేను చదవలేక పోతున్నాననడంతో.. మా నాన్న నేను చూసుకుంటానని చెప్పినా కూడా నాకు లోపల భయంగానే ఉందని చెప్పుకొచ్చాడు.
స్టాట్యూస్ ఆర్ నాట్ ఏ ఫామ్ ఆఫ్ హానర్..!
ఇది చాలా అన్యాయం.. ఇంత మందిని బాధ పెట్టి గాంధీ స్టాట్యూ కట్టడం కరెక్ట్ కాదు
ఆ స్టాట్యూతో ఏమీ రాదు.. మీకు నిజంగా గాంధీ గారికి మర్యాద ఇవ్వాలి అనుకుంటే ఆ రూ.5 వేల కోట్లతో వేరే ఏమైనా డెవలప్మెంట్ చేయండి
వారం రోజుల్లో నాకు ఇంటర్ పరీక్షలు… https://t.co/xISleLwpvn pic.twitter.com/bni76SOq93
— Telugu Scribe (@TeluguScribe) February 19, 2026
Congress | కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో ప్రవర్తిస్తున్నది : గండ్ర వెంకటరమణారెడ్డి
Afghanistan | ఎముకలు విరిగితేనే నేరమట.. గృహ హింసను చట్టబద్ధం చేసిన అఫ్గానిస్థాన్..!
‘మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకం’