హైదరాబాద్ : సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను( Rajendra Prasad) మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి మరణించారు. విషయం తెలుసుకున్న తలసాని కూకట్‌పల్లిలోని వారి నివాసానికి వెళ్లి గాయత్రి చిత్రపటానికి పూల మాళలు వేసి నివాళులు(Tribute) అర్పించారు. అనంతరం రాజేంద్రప్రసాద్, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు.
కాగా, రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి(38) గుండెపోటుతో కన్నుమూశారు. శనివారం ఛాతిలో నొప్పి రావడంతో ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌కు కుమార్తె గాయత్రితోపాటు కుమారుడు కూడా ఉన్నారు. గాయత్రిది ప్రేమ వివాహం. ఆమెకు ఓ కూతురు కూడా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
RTC | ఆర్టీసీకి అద్దె బస్సుల గండం.. ప్రైవేటీకరణ వైపు అడుగులు?
Musi Riverfront | బాబు చూపిన బాటలో రేవంత్.. అప్పుడు నందనవనం.. ఇప్పుడు రివర్ ఫ్రంట్
Head Constable | హెడ్ కానిస్టేబుల్ వంకర బుద్ధి.. డయల్ 100కు కాల్ చేసిన మహిళతో పరిచయం పెంచుకుని..